Monday, 02 November 2026
Sircilla Muchatlu
BREAKING NEWS
NEW
పేదల స్వయం ఉపాధికి బాసట – సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పండ్ల బండ్ల వితరణ • పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి, పవర్ లూం కార్మికులకు న్యాయం చేయాలి – ఏఐటీయూసీ డిమాండ్ • కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. సిరిసిల్ల నుంచి వేములవాడకు బీఆర్ఎస్వీ పాదయాత్ర • సిరిసిల్ల మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు – రూ.108.50 లక్షల అభివృద్ధి పనులకు ఆమోదం • సిరిసిల్ల: కెసిఆర్, కెటిఆర్ పై విమర్శించే స్థాయి నీకు లేదు.. విప్ ఆది శ్రీనివాస్ పై బీఆర్ఎస్ ఫైర్ • సిరిసిల్ల : అర్ధరాత్రి ఇళ్లలోకి దూరుతున్న కొండచిలువల! శ్రీనగర్ కాలనీలో నిద్రలేని రాత్రులు • ఎల్ నినో ఎఫెక్ట్… ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం : కలెక్టర్ గరిమ అగర్వాల్ • “కార్మికులు జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి” • OTP అక్కర్లేదు, లింక్ నొక్కక్కర్లేదు… వాట్సాప్‌లో NO అంటే చాలు, బ్యాంక్ ఖాతా ఖాళీ! • సిరిసిల్ల పద్మశాలి సంఘం నూతన కార్యాలయం ప్రారంభం… అధ్యక్షుడిగా నాగుల శ్రీనివాస్ •
NEWS

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Published on 24 Apr 2026
SM_వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

SM- Vemulawada news: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం ఐపీఎస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీజీపీ ఆలయ వసతి గృహానికి చేరుకున్న వెంటనే పోలీస్ బృందం గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) సమర్పించింది. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన ఆయనకు ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తి వాచకంతో ఘనంగా స్వాగతం పలికారు. తరువాత స్వామివారి మండపంలో అర్చకులు వేద పండితులు తీర్థ ప్రసాదం అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ డీఈఓ భాస్కర శర్మ స్వామివారి శేష వస్త్రం, లడ్డు ప్రసాదం చిత్రపటాన్ని డీజీపీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, వేములవాడ ఆర్డీవో రాధాబాయి, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, ఆలయ ఏఈఓ జి.అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News