Monday, 02 November 2026
Sircilla Muchatlu
BREAKING NEWS
NEW
పేదల స్వయం ఉపాధికి బాసట – సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పండ్ల బండ్ల వితరణ • పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి, పవర్ లూం కార్మికులకు న్యాయం చేయాలి – ఏఐటీయూసీ డిమాండ్ • కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. సిరిసిల్ల నుంచి వేములవాడకు బీఆర్ఎస్వీ పాదయాత్ర • సిరిసిల్ల మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు – రూ.108.50 లక్షల అభివృద్ధి పనులకు ఆమోదం • సిరిసిల్ల: కెసిఆర్, కెటిఆర్ పై విమర్శించే స్థాయి నీకు లేదు.. విప్ ఆది శ్రీనివాస్ పై బీఆర్ఎస్ ఫైర్ • సిరిసిల్ల : అర్ధరాత్రి ఇళ్లలోకి దూరుతున్న కొండచిలువల! శ్రీనగర్ కాలనీలో నిద్రలేని రాత్రులు • ఎల్ నినో ఎఫెక్ట్… ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం : కలెక్టర్ గరిమ అగర్వాల్ • “కార్మికులు జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి” • OTP అక్కర్లేదు, లింక్ నొక్కక్కర్లేదు… వాట్సాప్‌లో NO అంటే చాలు, బ్యాంక్ ఖాతా ఖాళీ! • సిరిసిల్ల పద్మశాలి సంఘం నూతన కార్యాలయం ప్రారంభం… అధ్యక్షుడిగా నాగుల శ్రీనివాస్ •
DISTRICT NEWS

సిరిసిల్ల : అర్ధరాత్రి ఇళ్లలోకి దూరుతున్న కొండచిలువల! శ్రీనగర్ కాలనీలో నిద్రలేని రాత్రులు

Published on 17 Oct 2026

సిరిసిల్ల ముచ్చట్లు, రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో ప్రస్తుతం కొండచిలువల భయం నెలకొంది. గత కొద్ది రోజులుగా కాలనీ పరిసరాల్లో సంచరిస్తున్న కొండచిలువలు, ఇప్పుడు ఏకంగా రోడ్లపైనే కాకుండా నేరుగా ఇళ్లలోకి చొరబడుతుండటంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, రాత్రి వేళల్లో వంట గదుల్లోకి, పెరట్లోకి, పడక గదుల్లోకి సైతం కొండచిలువలు వస్తున్నాయని, దీంతో పిల్లలు, మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను బయటకు పంపాలంటేనే భయమేస్తోందని వాపోతున్నారు.

ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి, కాలనీలో సంచరిస్తున్న కొండచిలువలను పట్టుకుని అటవీ ప్రాంతంలోకి తరలించి, తమకు రక్షణ కల్పించాలని శ్రీనగర్ కాలనీవాసులు వేడుకుంటున్నారు.

Advertisement

Related News