Monday, 02 November 2026
Sircilla Muchatlu
BREAKING NEWS
NEW
పేదల స్వయం ఉపాధికి బాసట – సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పండ్ల బండ్ల వితరణ • పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి, పవర్ లూం కార్మికులకు న్యాయం చేయాలి – ఏఐటీయూసీ డిమాండ్ • కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. సిరిసిల్ల నుంచి వేములవాడకు బీఆర్ఎస్వీ పాదయాత్ర • సిరిసిల్ల మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు – రూ.108.50 లక్షల అభివృద్ధి పనులకు ఆమోదం • సిరిసిల్ల: కెసిఆర్, కెటిఆర్ పై విమర్శించే స్థాయి నీకు లేదు.. విప్ ఆది శ్రీనివాస్ పై బీఆర్ఎస్ ఫైర్ • సిరిసిల్ల : అర్ధరాత్రి ఇళ్లలోకి దూరుతున్న కొండచిలువల! శ్రీనగర్ కాలనీలో నిద్రలేని రాత్రులు • ఎల్ నినో ఎఫెక్ట్… ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం : కలెక్టర్ గరిమ అగర్వాల్ • “కార్మికులు జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి” • OTP అక్కర్లేదు, లింక్ నొక్కక్కర్లేదు… వాట్సాప్‌లో NO అంటే చాలు, బ్యాంక్ ఖాతా ఖాళీ! • సిరిసిల్ల పద్మశాలి సంఘం నూతన కార్యాలయం ప్రారంభం… అధ్యక్షుడిగా నాగుల శ్రీనివాస్ •
NEWS

కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. సిరిసిల్ల నుంచి వేములవాడకు బీఆర్ఎస్వీ పాదయాత్ర

Published on 31 Oct 2026

సిరిసిల్ల ముచ్చట్లు,రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు.

సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌరస్తా వద్ద జై కేసీఆర్ నినాదాల మధ్య కంచర్ల రవి గౌడ్ పాదయాత్రను ప్రారంభించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటాన్ని చేతబట్టి, గులాబీ కండువాలు ధరించి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అని, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.తెలంగాణకు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి కొనసాగుతుందని, ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆకాంక్షతోనే రాజన్న సన్నిధికి పాదయాత్రగా బయలుదేరినట్లు తెలిపారు.వేములవాడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, తిరిగి ముఖ్యమంత్రి కావాలని రాజన్నను ప్రార్థించనున్నట్లు తెలిపారు.ఈ పాదయాత్రలో బీఆర్ఎస్వీ నాయకులు మట్టి శ్రీనివాస్, సదుల శేఖర్, కల్యాడపు వినయ్, గజుల రిష్విత్, బసాని అనీష్ కుమార్, కసర్ల మణిశర్మ, కోయేటి జశ్వంత్, కంకణాల సాయి తేజ, తన్నీరు నవనీత్, కంభోజి హర్షిత్, అన్నడి సాత్విక్, చిలువేరి రాంచరణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News