సిరిసిల్ల పద్మశాలి సంఘం నూతన కార్యాలయం ప్రారంభం… అధ్యక్షుడిగా నాగుల శ్రీనివాస్

సిరిసిల్ల ముచ్చట్లు సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో పట్టణ పద్మశాలి సంఘం కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్ హాజరయ్యారు.
అతిథులుగా పద్మ పీఠం ఎడిటర్ కొక్కుల భాస్కర్, మార్కండేయ జయంతి ఉత్సవ సమితి కన్వీనర్ మోర శ్రీనివాస్, దుబ్బాక పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గాలయ్య, మాజీ కౌన్సిలర్లు గుడూరి భాస్కర్, పత్తిపాక పద్మ శంకర్ పాల్గొన్నారు.
పద్మశాలీల ఆత్మగౌరవం, ఐక్యత కోసం ఏర్పడిన ఈ సంఘంలో కేవలం 10 రూపాయలతో సభ్యత్వం తీసుకొని 50 నుంచి 60 వేల మంది సభ్యులను చేర్చి బలోపేతం చేస్తామని, రాబోయే ఎన్నికలలో సిరిసిల్ల నుండి పద్మశాలినే అసెంబ్లీకి పంపుతామని నాయకులు తెలిపారు.
నూతన కార్యవర్గం: అధ్యక్షుడు – నాగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి – మాదాస్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు – గుంటుక పురుషోత్తం, సహాయ కార్యదర్శి – జిందం రవీందర్, కోశాధికారి – దాసరి వెంకటేష్, సభ్యులు – గాజుల సదానందం, దూడం సురేష్, తాటిపాముల సత్యనారాయణ.
కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహణ అధ్యక్షుడు గొనె ఎల్లప్ప, అరుకాల రమేష్, దేవనపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.