Monday, 02 November 2026
Sircilla Muchatlu
BREAKING NEWS
NEW
పేదల స్వయం ఉపాధికి బాసట – సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పండ్ల బండ్ల వితరణ • పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి, పవర్ లూం కార్మికులకు న్యాయం చేయాలి – ఏఐటీయూసీ డిమాండ్ • కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. సిరిసిల్ల నుంచి వేములవాడకు బీఆర్ఎస్వీ పాదయాత్ర • సిరిసిల్ల మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు – రూ.108.50 లక్షల అభివృద్ధి పనులకు ఆమోదం • సిరిసిల్ల: కెసిఆర్, కెటిఆర్ పై విమర్శించే స్థాయి నీకు లేదు.. విప్ ఆది శ్రీనివాస్ పై బీఆర్ఎస్ ఫైర్ • సిరిసిల్ల : అర్ధరాత్రి ఇళ్లలోకి దూరుతున్న కొండచిలువల! శ్రీనగర్ కాలనీలో నిద్రలేని రాత్రులు • ఎల్ నినో ఎఫెక్ట్… ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం : కలెక్టర్ గరిమ అగర్వాల్ • “కార్మికులు జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి” • OTP అక్కర్లేదు, లింక్ నొక్కక్కర్లేదు… వాట్సాప్‌లో NO అంటే చాలు, బ్యాంక్ ఖాతా ఖాళీ! • సిరిసిల్ల పద్మశాలి సంఘం నూతన కార్యాలయం ప్రారంభం… అధ్యక్షుడిగా నాగుల శ్రీనివాస్ •
NEWS

పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి, పవర్ లూం కార్మికులకు న్యాయం చేయాలి – ఏఐటీయూసీ డిమాండ్

Published on 31 Oct 2026

సిరిసిల్ల ముచ్చట్లు,రాజన్న సిరిసిల్ల జిల్లా: ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సుభాష్ నగర్ లోని ఏఐటీయూసీ కార్మిక భవన్ లో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అజ్జ వేణు జెండాను ఎగురవేశారు.

అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..1920 అక్టోబర్ 31న లాలా లజపతిరాయ్ అధ్యక్షతన ఏఐటీయూసీ ఆవిర్భవించిందని, నాటినుండి బ్రిటిష్ వారితో సైతం పోరాడి కార్మికుల హక్కుల కోసం పోరాడిందన్నారు. స్వేచ్ఛ, లింగ వివక్ష లేని వేతనం, సెలవులు, సంఘం పెట్టుకునే హక్కు, కనీస వేతన హక్కు, ఉద్యోగ భద్రత వంటి 44 కార్మిక చట్టాలు ఉంటే, వాటిలో 29 చట్టాలను 4 కోడ్ లుగా విభజించి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చి కార్మిక ద్రోహానికి పాల్పడుతోందని విమర్శించారు.సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, కనీస వేతనాల చట్టం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పేర్లతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.ఆశాలు, అంగన్ వాడీలు, NHM, మున్సిపల్, గ్రామపంచాయతీ, దేవస్థాన ఉద్యోగులు కనీస వేతనాలకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

డిమాండ్లు:

భవన నిర్మాణ రంగంలో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి

సిరిసిల్లలో రెగ్యులర్ ALO ను నియమించాలి

పవర్ లూం రంగ కార్మికులకు Work to Owner అమలు చేయాలి

స్థానిక కార్మికులకే ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇవ్వాలి

హమాలీ కార్మికులకు హెల్త్ కార్డులు, ప్రమాద భీమా, ఇన్సూరెన్స్ కల్పించాలి

ఈ కార్యక్రమంలో తన్నీరు రామస్వామి, పండుగ చంద్రయ్య, డప్పు స్వామి, మాన్వాడ పరమేశ్వర్, అలుగొండ ఎల్లయ్య, కొంక విజయ్, అన్నమనేని భూదన్న, చీకోటి రాజు, నీరటి బాలయ్య, తాటకార్ల శంకర్, కొత్తపెల్లి రవిచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News