Monday, 02 November 2026
Sircilla Muchatlu
BREAKING NEWS
NEW
పేదల స్వయం ఉపాధికి బాసట – సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పండ్ల బండ్ల వితరణ • పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి, పవర్ లూం కార్మికులకు న్యాయం చేయాలి – ఏఐటీయూసీ డిమాండ్ • కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. సిరిసిల్ల నుంచి వేములవాడకు బీఆర్ఎస్వీ పాదయాత్ర • సిరిసిల్ల మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు – రూ.108.50 లక్షల అభివృద్ధి పనులకు ఆమోదం • సిరిసిల్ల: కెసిఆర్, కెటిఆర్ పై విమర్శించే స్థాయి నీకు లేదు.. విప్ ఆది శ్రీనివాస్ పై బీఆర్ఎస్ ఫైర్ • సిరిసిల్ల : అర్ధరాత్రి ఇళ్లలోకి దూరుతున్న కొండచిలువల! శ్రీనగర్ కాలనీలో నిద్రలేని రాత్రులు • ఎల్ నినో ఎఫెక్ట్… ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం : కలెక్టర్ గరిమ అగర్వాల్ • “కార్మికులు జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి” • OTP అక్కర్లేదు, లింక్ నొక్కక్కర్లేదు… వాట్సాప్‌లో NO అంటే చాలు, బ్యాంక్ ఖాతా ఖాళీ! • సిరిసిల్ల పద్మశాలి సంఘం నూతన కార్యాలయం ప్రారంభం… అధ్యక్షుడిగా నాగుల శ్రీనివాస్ •
NEWS

సిరిసిల్ల: కెసిఆర్, కెటిఆర్ పై విమర్శించే స్థాయి నీకు లేదు.. విప్ ఆది శ్రీనివాస్ పై బీఆర్ఎస్ ఫైర్

Published on 30 Oct 2026

సిరిసిల్ల ముచ్చట్లు,సిరిసిల్ల : సిరిసిల్ల తెలంగాణ భవన్ న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ లతో కలిసి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ.. ఇది ఎల్ నినోతో వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమర్శించారు. రైతులను కడుపులో పెట్టుకుని సాగు నీరు ఇచ్చి, రైతు బంధు, రైతు భీమా ఇచ్చి, పంటలను కొని రైతులకు అండగా నిలిచిన ఘనత కేసీఆర్ దేనన్నారు.రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో కరెంట్ ఎలా ఉంది.. మీ కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎలా ఉందో గ్రామాల్లో రైతులు, ప్రజలు చెపుతారన్నారు.కేసీఆర్, కేటీఆర్ పై విప్ ఆది శ్రీనివాస్ నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని, వారిపై విమర్శించే స్థాయి నీకు లేదని హెచ్చరించారు. “కూటిలో రాయి తీయనోడు.. ఏట్లో రాయి తీస్తాడా?” అన్నట్లు ఆది శ్రీనివాస్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు.నీ నియోజకవర్గం వేములవాడలో కరువు ఉందా? లేదా? ప్రజలను అడిగితే చెపుతారన్నారు. చేతనైతే వేములవాడ ఆలయాన్ని యాదాద్రి ఆలయం తరహాలో రాజన్న ఆలయాన్ని దమ్ముంటే నిర్మించు.. సిమెంట్ తో కాదు.. శిలలతో కట్టాలని సవాల్ విసిరారు. కమిషన్లతో ఆలయ నిర్మాణం చేస్తూ అబద్ధపు మాటలు చెప్పి పబ్బం గడుపుతున్నావని విమర్శించారు.ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేనియెడల ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.కొండూరు రవీందర్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వరి వేయొద్దని రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ అడగడం ఇప్పటివరకు చూడలేదన్నారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయకుండా కిందకు నీళ్లు పోతుంటే చోద్యం చూస్తున్నారని విమర్శించారు.కేసీఆర్, కేటీఆర్ లను తిట్టడమే విప్ ఆది శ్రీనివాస్ పని పెట్టుకున్నాడని, రేవంత్ రెడ్డి మెప్పు కోసం ఆరాటపడుతున్నాడని అన్నారు. అన్ని రంగాలకు హాలిడే, ఆంక్షలు పెట్టిన కాంగ్రెస్ సర్కార్ బేకార్ మాటలు బంద్ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణ తొందరెందుకు? ప్రజాధనం వృథా చేయకుండా రైతుల్ని ఆదుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, న్యాలకొండ రాఘవ రెడ్డి, కుంబాల మల్లారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, సింగిల్ విండో చైర్మన్లు బండి దేవదాస్ గౌడ్, గుండారపు కృష్ణారెడ్డి, అన్ని మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు

Advertisement

Related News