Monday, 02 November 2026
Sircilla Muchatlu
BREAKING NEWS
NEW
పేదల స్వయం ఉపాధికి బాసట – సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పండ్ల బండ్ల వితరణ • పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి, పవర్ లూం కార్మికులకు న్యాయం చేయాలి – ఏఐటీయూసీ డిమాండ్ • కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. సిరిసిల్ల నుంచి వేములవాడకు బీఆర్ఎస్వీ పాదయాత్ర • సిరిసిల్ల మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు – రూ.108.50 లక్షల అభివృద్ధి పనులకు ఆమోదం • సిరిసిల్ల: కెసిఆర్, కెటిఆర్ పై విమర్శించే స్థాయి నీకు లేదు.. విప్ ఆది శ్రీనివాస్ పై బీఆర్ఎస్ ఫైర్ • సిరిసిల్ల : అర్ధరాత్రి ఇళ్లలోకి దూరుతున్న కొండచిలువల! శ్రీనగర్ కాలనీలో నిద్రలేని రాత్రులు • ఎల్ నినో ఎఫెక్ట్… ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం : కలెక్టర్ గరిమ అగర్వాల్ • “కార్మికులు జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి” • OTP అక్కర్లేదు, లింక్ నొక్కక్కర్లేదు… వాట్సాప్‌లో NO అంటే చాలు, బ్యాంక్ ఖాతా ఖాళీ! • సిరిసిల్ల పద్మశాలి సంఘం నూతన కార్యాలయం ప్రారంభం… అధ్యక్షుడిగా నాగుల శ్రీనివాస్ •
NEWS

OTP అక్కర్లేదు, లింక్ నొక్కక్కర్లేదు… వాట్సాప్‌లో NO అంటే చాలు, బ్యాంక్ ఖాతా ఖాళీ!

Published on 13 Oct 2026

సిరిసిల్ల ముచ్చట్లు హైదరాబాద్: ఓటీపీలు అడగరు.. లింకులు నొక్కక్కర్లేదు! వాట్సాప్ సందేశానికి కేవలం ‘నో’ అని రిప్లై ఇస్తే చాలు క్షణాల్లో బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతోంది! సైబర్ కేటుగాళ్ల సరికొత్త పన్నాగం ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్ ఇప్పుడు కలకలం రేపుతోంది.

వాట్సాప్‌లో వచ్చిన ఒకే ఒక్క సందేశానికి కేవలం ‘NO’ అని రిప్లై ఇచ్చినందుకే ఒకరి బ్యాంక్ ఖాతా క్షణాల్లో నిలువునా ఖాళీ అయిపోయింది. బాధితుడు ఎవరికీ ఓటీపీ చెప్పలేదు, ఏ లింక్‌పైనా క్లిక్ చేయలేదు. కేవలం రెండక్షరాల సమాధానమే జీవితకాల సంపాదనను తుడిచిపెట్టేసింది. ఇటీవల ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను సైతం ముంచేసిన ఈ సరికొత్త సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది.

మోసం ఎలా జరుగుతోందంటే..
మొదట గుర్తుతెలియని నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు ‘మీ ఖాతా నుంచి ఇంత మొత్తం డెబిట్ అయ్యింది’ అంటూ నకిలీ సందేశం వస్తుంది. ఆ వెంటనే మిమ్మల్ని భయాందోళనకు గురిచేస్తూ ‘ఈ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే NO అని రిప్లై ఇవ్వండి’ అంటూ రెండో మెసేజ్ పంపుతారు.

ఖాతాలో డబ్బులు పోయాయన్న కంగారుతో మీరు ‘NO’ అని టైప్ చేసి పంపిన మరుక్షణమే.. ఆ సందేశంలో కనిపించకుండా దాగి ఉన్న మాల్‌వేర్ స్క్రిప్ట్స్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. క్షణాల్లో మీ మొబైల్ ఫోన్‌పై పూర్తి నియంత్రణను హ్యాకర్లు చేజిక్కించుకుని, బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మంతటినీ ఊడ్చేస్తారు.

తస్మాత్ జాగ్రత్త!

  • గుర్తుతెలియని నంబర్ల నుంచి బ్యాంక్ లావాదేవీల పేరుతో వచ్చే మెసేజ్‌లకు YES గానీ, NO గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రిప్లై ఇవ్వకండి!
  • కంగారుపడి సమాధానం పంపకుండా వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి చాట్‌ను డిలీట్ చేయండి.
  • డబ్బు కట్ అయిందో లేదో తెలుసుకోవడానికి అధికారిక బ్యాంక్ యాప్‌లోకి వెళ్లి నేరుగా చెక్ చేసుకోండి. ఏ అధికారిక బ్యాంకూ వాట్సాప్‌లో ఇలా సమాధానాలు కోరదు.
  • మోసానికి గురైతే గోల్డెన్ అవర్‌లో వెంటనే ‘1930’ సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.

కంగారులో ఇచ్చే ఒక్క NO అనే సందేశం మీ సర్వస్వాన్నీ తుడిచిపెట్టేస్తుంది.. తస్మాత్ జాగ్రత్త!!

Advertisement

Related News