Monday, 02 November 2026
Sircilla Muchatlu
BREAKING NEWS
NEW
పేదల స్వయం ఉపాధికి బాసట – సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పండ్ల బండ్ల వితరణ • పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి, పవర్ లూం కార్మికులకు న్యాయం చేయాలి – ఏఐటీయూసీ డిమాండ్ • కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. సిరిసిల్ల నుంచి వేములవాడకు బీఆర్ఎస్వీ పాదయాత్ర • సిరిసిల్ల మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు – రూ.108.50 లక్షల అభివృద్ధి పనులకు ఆమోదం • సిరిసిల్ల: కెసిఆర్, కెటిఆర్ పై విమర్శించే స్థాయి నీకు లేదు.. విప్ ఆది శ్రీనివాస్ పై బీఆర్ఎస్ ఫైర్ • సిరిసిల్ల : అర్ధరాత్రి ఇళ్లలోకి దూరుతున్న కొండచిలువల! శ్రీనగర్ కాలనీలో నిద్రలేని రాత్రులు • ఎల్ నినో ఎఫెక్ట్… ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం : కలెక్టర్ గరిమ అగర్వాల్ • “కార్మికులు జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి” • OTP అక్కర్లేదు, లింక్ నొక్కక్కర్లేదు… వాట్సాప్‌లో NO అంటే చాలు, బ్యాంక్ ఖాతా ఖాళీ! • సిరిసిల్ల పద్మశాలి సంఘం నూతన కార్యాలయం ప్రారంభం… అధ్యక్షుడిగా నాగుల శ్రీనివాస్ •
NEWS

కాంగ్రెస్ తీరుపై బీజేపీ ఫైర్… హుందాగా వ్యవహరించాలన్న దుమాల శ్రీకాంత్

Published on 10 Oct 2026

సిరిసిల్ల ముచ్చట్లు, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తీరుపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ తీవ్ర విమర్శలు చేశారు.

సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ఉన్నా, హుందాతనం పాటించాలన్నారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు జాతీయ నాయకులుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల అభివృద్ధి, దేశ గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, పట్టణ ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సమావేశంలో దేవరాజు, నరసయ్య, మోర రవి, దూడం సురేష్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News