Monday, 02 November 2026
Sircilla Muchatlu
BREAKING NEWS
NEW
పేదల స్వయం ఉపాధికి బాసట – సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పండ్ల బండ్ల వితరణ • పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి, పవర్ లూం కార్మికులకు న్యాయం చేయాలి – ఏఐటీయూసీ డిమాండ్ • కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. సిరిసిల్ల నుంచి వేములవాడకు బీఆర్ఎస్వీ పాదయాత్ర • సిరిసిల్ల మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు – రూ.108.50 లక్షల అభివృద్ధి పనులకు ఆమోదం • సిరిసిల్ల: కెసిఆర్, కెటిఆర్ పై విమర్శించే స్థాయి నీకు లేదు.. విప్ ఆది శ్రీనివాస్ పై బీఆర్ఎస్ ఫైర్ • సిరిసిల్ల : అర్ధరాత్రి ఇళ్లలోకి దూరుతున్న కొండచిలువల! శ్రీనగర్ కాలనీలో నిద్రలేని రాత్రులు • ఎల్ నినో ఎఫెక్ట్… ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం : కలెక్టర్ గరిమ అగర్వాల్ • “కార్మికులు జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి” • OTP అక్కర్లేదు, లింక్ నొక్కక్కర్లేదు… వాట్సాప్‌లో NO అంటే చాలు, బ్యాంక్ ఖాతా ఖాళీ! • సిరిసిల్ల పద్మశాలి సంఘం నూతన కార్యాలయం ప్రారంభం… అధ్యక్షుడిగా నాగుల శ్రీనివాస్ •
NEWS

సిరిసిల్ల టీచర్లకు హైదరాబాద్‌లో టీ-సాట్ శిక్షణ… ప్రశంసాపత్రాల ప్రదానం

Published on 09 Oct 2026

సిరిసిల్ల ముచ్చట్లు, రాజన్న సిరిసిల్ల: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతికత ఆధారంగా నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో పీఎం ఈ-విద్యా (PM eVidya) DTH ఛానెళ్ల కోసం ఉపాధ్యాయులకు నాలుగు రోజుల ప్రత్యేక సాంకేతిక శిక్షణను నిర్వహించారు.

అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు హైదరాబాద్‌లోని టీ-సాట్ (T-SAT) కార్యాలయంలో CIET-NCERT, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమం జరిగింది.

ఈ శిక్షణలో భాగంగా పాఠ్యాంశాలకు అనుగుణంగా స్క్రిప్ట్ రచన, స్టోరీబోర్డ్ రూపకల్పన, ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్-ప్రొడక్షన్ ప్రక్రియలపై NCERT ప్రొఫెసర్లు, నిపుణులు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులచే స్వయంగా విద్యా వీడియోలను రూపొందింపజేసి, బోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించే మెలకువలను నేర్పించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి చందుర్తి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కాపిల్ల నరేష్, జోగాపూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అంజయ్య, తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు స్వరాజ్యలక్ష్మి ఈ శిక్షణలో పాల్గొన్నారు.

శుక్రవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో SCERT తెలంగాణ డైరెక్టర్ గాజర్ల రమేష్, టీ-సాట్ సీఈఓ వేణుగోపాల్, తెలంగాణ పీఎం ఈ-విద్యా కోఆర్డినేటర్ కోమల్ అరోరా చేతుల మీదుగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ శిక్షణ ద్వారా డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి ఆకర్షణీయమైన, నాణ్యమైన బోధనా వీడియోలను రూపొందించడంతో పాటు, రాష్ట్ర విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యను మరింత చేరువ చేసేందుకు అవసరమైన నైపుణ్యాలు లభించాయని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News